- మహనీయుల త్యాగాలు మరువలేనివి
- కెసిఆర్ పరిపాలన సంక్షేమ పథకాలు భేష్
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
- తెలంగాణ భవన్ లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
- రేగా క్యాంపు కార్యాలయంలోనూ వేడుకలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒకరు కృషి చేస్తూ ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తీ ఏరియాలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్)లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ
దేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం అమరులైన వీరుల గురించి వారి పోరాటాల గురించి వివరించారు. మహాత్ముల ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
కెసిఆర్ సంక్షేమ పథకాలు భేష్…
మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ అమలు కానీ సంక్షేమ పథకాలు ఒక తెలంగాణలో మాత్రమే అమలు జరగడం గర్వించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న మహార్నిశల కృషి మరువలేనిదన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో నడిపిస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ విప్ రేగా క్యాంపు కార్యాలయంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండగల రాజేందర్, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.