మహనీయుల ఆశయాలను నెరవేర్చాలి
* ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఎందరో త్యాగదనుల ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ప్రతి ఏడాది జరుపుకుంటున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించి, స్వతంత్ర భారత్ మాతాకీ జై.. జై కెసిఆర్.. జై కేటీఆర్.. జై వనమా అంటూ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంలో కెసిఆర్ కృషి మరువలేనిదన్నారు.
ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎంపీపీలు బాదావత్ శాంతి, బుక్య సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచ్ లు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, పట్టణ, మండల కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.