ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
*ప్రార్ధన వీరుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 15: మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారంస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మెచ్చా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వారందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ అక్కడే ఉన్న చిన్నారులతో ప్రేమగా ముచ్చటించి సమయం గడిపారు. ఆదేవిందంగా డ్రైవర్స్ కాలనీలోని హోసన్నా మందిర్ లో పాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనా వీరుల సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు అలాగే అశ్వారావుపేటలో సెంటర్ లైటింగ్, డిగ్రీ కళాశాల,100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి అభివృద్ది పథంలో ఎమ్మెల్యే మెచ్చా నడుపుతున్నారని అన్నారు. మంచి చేసే వారి పై ప్రభువు యొక్క దీవెనలు ఉంటాయన్నారు, రానున్నరోజుల్లో కూడా ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు కొనసాగాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ప్రార్థనా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చల్లని దీవెనలతో అభివృద్ది చేశానన్నారు. డ్రైవర్స్ కాలనీలో సీసీ రోడ్డు కూడా మంజూరు చేశానని వారికి తెలిపారు. అలాగే గుర్రాలచెరువు గ్రామంలో ఇటీవలే ఒకరి ఇల్లు అగ్ని ప్రమాదం జరిగి దగ్ధం కాగా మంగళ వారం మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వారికి ఆర్థిక సహాయం అందించారు అలాగే గృహ లక్ష్మి పథకంలో వారికి ఇల్లు మంజూరు చేస్తాననీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్, మండల నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.