- ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
- భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం.
- గిరిజన రైతుల అభివృద్ధి కోసం,వారి సంక్షేమానికి పాటుపడాలి.
ఐ టి డీఏ పీ ఓడేవిడ్ రాజ్
మన్యం న్యూస్,బూర్గంపాడు(భద్రాచలం):
భారత స్వాతంత్ర పోరాటంలో దేశ సమగ్రతకు సర్వతో ముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి అసువులు బాసిన మన జాతిపిత మహాత్మా గాంధీ,పండిత్ జవహర్లాల్ నెహ్రూ లాంటి మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామని,భద్రాచలం ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్,ఇన్చార్జి ఆర్సిఓ గురుకులం డేవిడ్ రాజ్ అన్నారు.మంగళవారం నాడు 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున ఐటీడీఏ కార్యాలయంలోని ఆవరణలో యూనిట్ అధికారుల సమక్షంలో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి,జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులకు,విద్యార్థిని,విద్యార్థులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతూ,ఆయన మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని,దేశభక్తులందరికీ అలాగే స్వేచ్చకై తిరుగుబాటు చేసిన త్యాగధనులు అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ వంటి వారు మనకు ఆదర్శప్రాయంగా ఉండాలని,అలాగే మహనీయుల ఆశయాలు,త్యాగాల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని వేల సంవత్సరాల చారిత్రిక సంస్కృతిక వైభవంతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నిలిచి సామరస్య సమానమే మౌలిక లక్షణాలతో పయనిస్తున్న మన దేశ చరిత్రలో ఇది ఒక మైలు రాయిగా ఉంటుందని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్యా ,వైద్యం,ఇంజనీరింగ్,వ్యవసాయం,మౌలిక వసతులు,సాగునీరు,త్రాగునీరు,స్వయం ఉపాధి తదితర రంగాలలో గిరిజనుల సంక్షేమానికి మనమందరం తోడ్పాటు అందించి,ముఖ్యంగా గిరిజన విద్యార్థిని విద్యార్థుల విద్యాభివృద్ధికి మరియు ఆదివాసి గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు మరియు అభివృద్ధికి అలాగే గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యం,విద్యుత్ సౌకర్యం,చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం తో పాటు గర్భిణీలకు బాలామృతం,మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసించే కొండ రెడ్ల కుటుంబాల అభివృద్ధి కోసం,నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం,మారుమూల అటవీ ప్రాంతాల నుంచి అటవీ ఫలాలు సేకరించే గిరిజనుల కోసం,గిరిజన రైతుల అభివృద్ధి కోసం,మనమందరం కలిసికట్టుగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడాలని కోరుకుంటూ మరి ఒకసారి 77వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానుఅని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి భీమ్,డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ,ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ,డిఎంజిసిసి విజయ్ కుమార్,ఎస్ ఓ సురేష్ బాబు,హెచ్ ఎన్ టిసి అశోక్ కుమార్,డిటిఆర్ఓఎఫ్ ఆర్.శ్రీనివాస్,ఏసిఎంఓ రమణయ్య,ఏపీఓ పవర్ మునీర్ భాష,మరియు వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
