మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని ప్రగతి మైదానంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొన్నారు. ముందుగా అతిధికి అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. తర్వాత ప్రగతి మైదానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ ను రేగా కాంతారావు సందర్శించి ఖుషి ఖుషి అయ్యారు. వ్యవసాయం విద్యా వైద్య చేతివృత్తుల రంగానికి చెందిన స్టాల్స్ తో పాటు మరికొన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేయగా అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్టాల్స్ ను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. దీంతో ప్రగతి మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రేగా కాంతారావు తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజ్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.