మన్యం న్యూస్ చర్ల:
మండల కేంద్రం లోని మండల బీ.ఆర్.ఎస్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ అద్యక్షులు సోయం రాజారావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం అని మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి గులాబీ కార్యకర్త ఒక సైనికుని వలే కష్టపడి పార్టీ చేస్తున్న చేసిన అభివృద్ధి పనులను అలాగే లబ్ధిదారులకు అందిస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలి అని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిరోజూ మండలంలో ఒక గ్రామంలో పర్యటిస్తూ స్థానిక నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలు అందరూ అక్కడి ప్రజలతో మమేకం అవుతూ రాబోవు ఎన్నికల వరకు అందరూ కష్టపడి పని చేయాలన్నారు.మాజీ ఎమ్మెల్సీ బాలసాని నాయకత్వములో భద్రాద్రి గడ్డ మీద గులాబీ జెండా ఎగుర వేయడానికి ప్రతిఒక్క కార్యకర్త అవిశ్రాంతంగా కష్టపడాలి అని తెలియచేశారు. అదే విధంగా ఇటీవల ముఖ్యమంత్రి కేసిఆర్ నీ కలిసి మండల అభివృద్ధి కి 2కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి బాలసాని లక్ష్మీనారాయణకి మండల ప్రజానీకం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు లంకరాజు ప్రచార కార్యదర్శి శ్రీనివాసరెడ్డి చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు సహాయ కార్యదర్శి అలం ఈశ్వర్ నాగరాజు, సూరిబాబు యూత్ అధ్యక్ష కార్యదర్శులు అనిల్ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు అజీజ్ లాలయ్య తాతారావు తూర్రం రవి, రాజబాబు, జనార్ధన్ సితపతి , తోటమల్ల రవి రాంబాబు సతీష్, సంతోష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
