- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- స్వతంత్ర భారతదేశాన్ని మనకు అందించిన మహనీయుల ఆశయ సాధనలో నిరంతరం పయనిద్దాం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ హరిసింగ్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. తొలుతగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జాతిపిత మహాత్మాగాంధీ మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు15,1947న స్వాతంత్య్రం సిద్ధించిందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గుర్తు చేశారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఇంతటి గొప్ప స్వతంత్ర దేశాన్ని మనకందించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆ మహనీయుల ఆశయాల సాధనకు, ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి కృషిచేద్దాం అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆ స్పూర్తితోనే తెలంగాణా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ భారత దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ముఖ్యంగా యువత దేశ శ్రేయస్సుకై పాటుపడాలని, చెడును త్యజించి మంచికై అడుగులు వేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు భానోత్ హరిసింగ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కటకం పద్మావతి, కొక్కు నాగేశ్వరావు, సయ్యద్ ఆజాం, తోట లలిత శారద, సిలివేరి అనిత, కడకంచి పద్మ, చీమల సుజాత, గిన్నారపు రజిత, ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల( బబ్లూ), పట్టణ ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వరరావు, మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, మండల ఇంచార్జ్ యలమద్ది రవి, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, బాలాజీ నగర్ ఉపసర్పంచ్ మైబూబి, జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, ఎస్కేపాషా, ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్, ప్రచార కార్యదర్శి రాచపల్లి శీను, యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్, హరిహరక్షేత్రం ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, నెమలి నిఖిల్, ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్, మైనార్టీ నాయకులు చాంద్ పాషా, మదర్ బి, ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కుదిరి లక్ష్మీనారాయణ, తుంగపల్లి మహేష్, మునిగంటి శివ, రసూల్ తదితరులు పాల్గొన్నారు.