మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 16
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం మొండికుంట లో జరిగిన ఆటో యాక్సిడెంట్ క్షతగాత్రులను మణుగూరు ఎంపీటీసీ గుడిపూడి. కోటేశ్వరరావు పరామర్శించారు.ఈ మేరకు భద్రాచలం లోని డాక్టర్ దేవరాజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు మణుగూరు మండలం కూనవరం కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్.ఇజహర్, ఇజహర్ భార్య సజీదా బేగం,పద్మ శ్రీ అవార్డు గ్రహిత సకిని.రామచంద్రయ్య మనుమడు కు తీవ్ర గాయాలు అయ్యాయి,వారి ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.అనంతరం డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్చి, ధైర్యం కల్పించారు.ఈ సందర్బంగా వారందరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో పద్మ శ్రీ అవార్డు గ్రహిత సకిని.రామచంద్రయ్య ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు, కూనవరం ఆర్.ఎం.పి డాక్టర్ పాషా,మైనారిటీ నాయకులు షాహిద్ తదితరులు పాల్గొన్నారు.