మన్యం న్యూస్, దుమ్ముగూడెం, ఆగస్టు 16::
రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దుమ్ముగూడెం మండలం పౌలూరిపేట గ్రామాలకు చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో విధి విధానాలపై ఆకర్షితులై పార్టీలో చేరారు. వారిని పార్టీ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే వీరయ్య ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రజలు ముందు ఉంచుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్,దుమ్ముగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడి చంటి, మాజీ సర్పంచ్ కనితి సమ్మయ్య, కంగల వెంకటేశ్వర్లు, రాఘవ, పాయం తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.