UPDATES  

 కేసీఆర్ పథకాలు తెలంగాణ కు శ్రీరామ రక్ష

కేసీఆర్ పథకాలు తెలంగాణ కు శ్రీరామ రక్ష
* బీఆర్ఎస్ లో చేరినన్యూడెమోక్రసీ నాయకులు
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:కేసీఆర్ పథకాలు తెలంగాణ కు శ్రీరామ రక్ష అని ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు.బిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో గత 30 సంవత్సరాలగా న్యూడెమోక్రసీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు టేకులపల్లి మండలం బానోత్ లక్పతి, బండారి శ్రీను, నాన బాలబిక్షంల ఆధ్వర్యంలో బేతంపూడి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బుధవారంనాడు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరడం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వారికి పార్టీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతికార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కష్టపడే వారికి ప్రతిస్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. బిఆర్ఎస్ కి కార్యకర్తలే బలగం అని వారందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని ఉద్ఘాటించారు. ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ముందంజలో ఉందని, బిఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని ఇతర పార్టీలకు తెలంగాణలో తావులేదని పేర్కొన్నారు. ఇది గమనించిన వివిధపార్టీల నేతలు వలసలు వస్తున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !