మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 16: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని గండుగులపల్లిలోవారి స్వగృహంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పామాయిల్ పరిస్థితులపై కొద్దిసేపు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పిటిసిలు, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వwరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ కర్మాగారం మేనేజర్లు బాలకృష్ణ, కల్యాణ్, బిఅర్ఎస్ నాయకులు కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.