UPDATES  

 యంగ్ ఓటర్ల పై ఫోకస్ పెట్టండి:కలెక్టర్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
యంగ్ ఓటర్లుకు ఓటుహక్కు వినియోగంపై విస్తుృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. బుధవారం హైదరాబాదు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ స్వీప్ కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పనకు ఫారం 6 ద్వారా నమోదు చేసేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్ట్ విధులు కారణంగా ఓటుహక్కు వినియోగించుకోలేక పోతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేసి సహాయ ఎన్నికల అధికారులు ధృవీకరణ నివేదికలు అందచేయు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహణపై బూతుస్థాయి, సహాయ ఎన్నికల అధికారుల నుండి ధృవీకరణ నివేదికలు తీసుకుంటామని చెప్పారు. ఈవియంల ద్వారా ఓటుహక్కు వినియోగంపై యంగ్ మరియు ఇతర ఓటర్లు అవగాహన కల్పనకు మొబైల్ వాహనాల ఏర్పాటు ద్వారా
మాక్ ఓటింగ్ ప్రక్రియ అన్ని పోలింగ్ కేంద్రాల వారిగా ముమ్మరంగా
జరుగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఎన్నికల సెల్ పర్యవేక్షకులు ప్రసాద్, నవీన్, సాయి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !