మన్యం న్యూస్ దుమ్మగూడెం ఆగస్టు 16::
దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అన్నే సత్యనారాయణమూర్తిని భద్రాచలం నియోజవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు సత్యాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశించారు. కాగా అన్నేఇటీవల ప్రమాదానికి గురై కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నరు.అన్నేను పరామర్శించిన వారిలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, చర్ల సోయం రాజారావు, వెంకటాపురం గంప రాంబాబు, వాజేడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.