జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ
* సర్క్యులర్ జారీ చేసిన డీఈఓ
*’ఫలించిన టియూడబ్ల్యూజె(టిజెఎఫ్)143 నాయకుల కృషి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓ సోమశేఖర వర్మ జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ బుధవారం సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులకు, ప్రైవేట్ స్కూళ్లకు సర్య్కులర్ జారీ చేశారు. 2023–24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కోరుతూ గత నెలలో 6వ తేదీన భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసిన టియూడబ్ల్యూజె (టిజెఎఫ్) 143 ప్రతినిధి బృందం డీఈఓకు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు. ఫీజు రాయితీపై డీఈఓ ఆదేశాలు జారీ చేయడం పట్ల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజీ శ్రీనివాస్, మహమ్మద్ షఫీ, టెంజు అధ్యక్ష, కార్యదర్శులు వట్టికొండ రవి, సిహెచ్ నరసింహరావు, యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేయగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లు యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.