మన్యం న్యూస్ ,అశ్వాపురం: మండల నూతన తహశీల్దార్ గా రమాదేవి,బుధవారం బాధ్యతలు చేపట్టారు. నూతన తహశీల్దార్ రమాదేవి ని నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ,నెల్లిపాక మాజీ ఎంపీటీసీ,అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,అశ్వాపురం మండల బిఆర్ఎస్ నాయకులు గాదె వెంకటేశ్వర్లు,రాధాకృష్ణ పలువురు గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రమాదేవి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ,రాజకీయ పక్షాల నాయకులు సహకరించాలని కోరారు.