మంచి న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పదవీకాలం ముగిసిన 26 మంది ఏఎస్సైలు, 42 మంది హెడ్ కానిస్టేబుళ్లకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఎస్పీ డాక్టర్ వినీత్.జి బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు. పోలీస్ శాఖలో సీనియారిటీ ప్రకారం ఈ బదిలీ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా సేవలందిస్తూ ఈ బదిలీ ప్రక్రియలో పలు పోలీస్ స్టేషన్ లకు స్థానచలనం పొందిన ఏఎస్ఐ ,హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ లు బాధ్యతగా పనిచేస్తూ పోలీసులకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ డా.వినీత్ జీ కోరారు.