మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 17 : ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు తన తండ్రి అయిన నామా ముత్తయ్య పేరున ఏర్పాటు చేసిన నామా ముత్తయ్య ట్రస్టు సేవలు ప్రశంసనీయమని గానుగపాడు సోసైటి డైరక్టర్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాదక్షులు ఉన్నం నాగరాజు అన్నారు. గురువారం రేపల్లెవాడ, తుంగారం గ్రామాల్లోని ఆటో డ్రైవర్లుకు నామా ముత్తయ్య ట్రస్టు ఆద్వర్యంలో యూనిఫామ్స్ ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నామా ముత్తయ్య ట్రస్టు పేదలకు, అనారోగ్యంతో బాధపడే కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత అనేక ఏండ్లుగా ట్రస్టు సేవలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ఉపాదక్షులు సత్తి నాగేశ్వరరావు, నడిపి క్రిష్ణయ్య, మార్తి సత్యనారాయణ, ఆటోయూనియన్ నాయకులు, డ్రైవర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.