మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక విఠల్ రావ్ భవన్ నందు ఏఐఎస్ఎఫ్ పట్టణ, మండల మహాసభలను వినయ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా నాయకులు దేవరకొండ శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, విద్యారంగ సమస్యల పట్ల పోరాటంలోనూ అఖిలభారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కు ఒక చరిత్ర ఉందని వారు అన్నారు. చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ శాస్త్రీయ విద్యావిధానం కోసం మొట్టమొదటిగా కొట్లాడింది అఖిలభారత విద్యార్థి సమైక్యేనని, వృత్తివిద్య కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించింది అని అన్నారు. విద్యావిధానంలో విద్యార్థులకు అవసరమయ్యే సంస్కరణలు అవసరంలేని అంశాలను కూడా తెలియజేసిన ఘనత ఏఐఎస్ఎఫ్ కి దక్కుతుంది అన్నారు. ఈ మహాసభలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పట్టణ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అసంఘం పట్టణ కార్యదర్శిగా వినయ్, అధ్యక్షుడిగా కళ్యాణ్, పట్టణ కోశాధికారిగా వెంకటేష్, మండల కమిటీలో మండల కార్యదర్శిగా సాయి, అధ్యక్షుడిగా సన్నీలను ఎన్నుకోవడం జరిగింది. పట్టణ మండల కమిటీ సభ్యులుగా వివేకవర్ధన్, గణేష్, రాజేష్, చందు, నరేష్, గోపీచంద్, దుర్గాప్రసాద్, రవితేజ, వేణు, వివేక్, విష్ణులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.