మన్యం న్యూస్,ఇల్లందు:11వ వేజ్ బోర్డు 23నెలల ఎరియర్స్ ఆగస్ట్ నెల వేతనాలతో సెప్టెంబర్ 3న చెల్లించాలని ఇల్లందు ఏరియా జెకె ఓసి, సేక్యూరిటి డిపార్ట్మెంట్, వర్క్ షాప్, సిహెచ్పి, కెఓసి గనులపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు మెమొరాండం ఇవ్వడం జరిగింది. వివిధ గనులపై జరిగిన ధర్నాలలొ బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ఉపాద్యక్షులు దాసరి రాజారామ్లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కోల్ ఇండియాలో ఒప్పందం జరిగి సర్కులర్ వచ్చినా సింగరేణి యాజమాన్యంలో ఉలుకు పలుకు లేదని, గుర్తింపుసంఘం నోరు మెదపడం లేదని తెలిపారు. ఎప్పుడు ఏఐటీయూసీ, ఇతర జాతీయ సంఘాలను విమర్శించే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మౌనం వెనుక అర్థాన్ని కార్మికులు గమనించాలని వారు అన్నారు. పారిశ్రామిక సంభందాలు చక్కగా వుండాలంటే యాజమాన్యం వెంటనే ఏరియర్స్ చెల్లించాలని, లాభాల్లో వున్న సింగరేణికి ప్రకటించడానికి ఏం అడ్డువున్నదని ఇప్పటికైనా కార్మికుల అనుమానాన్ని తొలగించే విధంగా యాజమాన్యం వెంటనే ప్రకటన విడుదల చేసి వేతన బకాయిల ఉత్తర్వులు జారీచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి సహయ కార్యదర్శి గడదాసు నాగేశ్వరరావు, బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరిమి సుందర్, ఫిట్ కార్యదర్శులు సంజీవచారి, నూనె శ్రీనివాస్, భుషనమ్, అనిత, సహయ కార్యదర్శులు బొల్లేద్దుల శ్రీనివాస్, జక్కుల శ్రీనివాస్, పైడిరాజు, ప్రసాద్ రెడ్డి, ధర్మయ్య, శ్రీనివాసరెడ్డి, తిరుమలరావు, దాట్ల వేంకటేశ్వర్లు, తిరుపతి, వాసం వేంకటేశ్వర్లు, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.