మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 17, జూలూరుపాడు గ్రామ శివారు ప్రాంతంలో పేకాట స్థావరం పై స్థానిక పోలీసులు గురువారం మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు ఎస్సై బి పురుషోత్తం తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న నలుగురు వ్యక్తులను, వారి వద్ద ఉన్న 5,030 రూపాయల నగదును, మూడు సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు. పోలీసులకు కట్టుబడ్డ వ్యక్తులు అన్నారుపాడు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పట్టుబడ్డ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.