మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులై సీఎం కెసిఆర్ పాలనను మెచ్చి అనేకమంది బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం తెలంగాణ భవన్ లోని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ దే అధికారం అని స్పష్టం చేశారు.
