మన్యం న్యూస్,ఇల్లందు: మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం పెద్దతండ గ్రామంలో గల తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశుసంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ స్వగృహం నందు గురువారం జరిగిన వారి తల్లి ప్రథమ వర్ధంతికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ హాజరయ్యారు. అనంతరం చిత్రపటానికి ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ డీవీలు పూలువేసి నివాళులర్పించ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాష, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.