మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 17, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందారని సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని గుండెపుడి గ్రామంలో అనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన గ్రామ శాఖ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, దేశ సంపదను వారికి కట్ట బెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ సంస్థలకు అప్పచెప్పి ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి పథకాల్లో రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు వల్లమల్ల చందరరావు, శాఖ కార్యదర్శి ఇల్లంగి సీతారాములు, నాయకులు బానోతు మధు, దానయ్య, లక్ష్మ, ఇస్లావత్ బద్రు, రాములు, సక్రు తదితరులు పాల్గొన్నారు.