మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
రెండో ఏఎన్ఎంల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసెంబ్లీలో వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మోసం చేసేందుకేనా అని భారత జాతీయ మహిళా సమాఖ్య భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి ప్రశ్నించారు. క్రమబద్దీకరణ డిమాండ్స్ పై రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన మూడో రోజు నిరసన శిభిరాన్ని శుక్రవారం ఆమె సందర్శించి సమాఖ్య తరుపున సంఘీభావం తెలిపారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా మిడ్డేమీల్స్ రెండో ఏఎన్ఎం వంటి తదితర ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ అనుబంద సంస్థల్లో పనిచేస్తు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ పావులగా వాడుకుంటోందని కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారం పథకాల అమలుకోసం వాడుకుంటుందే తప్ప వారికి చట్టబద్దంగా అమలు కావాల్సిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో నాయకులు వి.పద్మజ, బల్లా సాయి కుమార్, అక్కి నర్సింహారావు, ఎండి.యూసుఫ్, సిబ్బంది ఎండి. సజ్జుబేగం, బానోతు ప్రియాంక, కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.