వర్కర్స్ యూనియన్ నూతన కమిటి ఎన్నిక
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
ఏఐటియుసి అనుబంద సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచి కార్పోరేట్ బ్రాంచీల నూతన కమిటీలు ఏర్పాటయ్యాయి. యూనియన్ కేంద్ర కమిటీ కార్యాలయం శేషగిరిభవన్లో వేర్వేరుగా జరిగిన మహాసభలో యూనియన్ ప్రతినిధులు ఎన్నుకున్న నూతన కమిటీలను శుక్రవారం ప్రకటించారు. యూనియన్ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శిగా వట్టికొండ మల్లికార్జున్‌రావు ఎన్నికకాగా సహాయ కార్యదర్శిగా జె.గట్టయ్య, ఉపాధ్యక్షులుగా కె.రాములు, టి.శేషగిరి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎస్.నాగేశ్వర్రావు, హుమాయున్, వీరయ్య, కోశాధికారిగా సందెబోయిన శ్రీనివాస్‌తోపాటు మరో 23 మందిని కార్యవర్గ సభ్యులుగా, 70మందిని కౌన్సిల్ సభ్యులుగా మహాసభ ప్రతినిధులు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటి ఇన్చార్జిగా రాజేశ్వర్‌రావు, టెక్నికల్ స్టాఫ్ ఇన్చార్జిగా కె.రమేష్‌లను ఎన్నుకున్నారు. కార్పోరేట్ బ్రాంచి కార్యదర్శిగా ఎస్.వి.రమణమూర్తి ఎన్నికకగా సహాయ కార్యదర్శిగా ఎస్.రాము, ఉపాధ్యక్షులుగా కె.డబ్ల్యు కిష్టాఫర్, కె.రాజేంద్రప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పి.నితిన్ కుమార్, టి.నాగయ్య, భాగ్యలక్ష్మి లతోపాటు 17 మందిని కార్యవర్గ సభ్యులుగా, 31మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.