మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
బహుజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.వి రంగాకిరణ్ అన్నారు. శుక్రవారం పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా చుంచుపల్లి లో ఏర్పటు చేసిన కార్యక్రమంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కె.వి రంగాకిరణ్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు సామాజిక రాజకీయ సమానత్వం కొరకు పాపన్న గౌడ్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. ఆనాటి కాలంలోనే అన్నివర్గాలు రాజ్యధికారంలో భాగస్వామి కావాలనే ఆయన ప్రజాస్వామ్య స్పూర్తితో పోరాటం చేయడం గొప్పవిషయంని అన్నారు. పాపన్న గౌడ్ ఆశయ సాధన కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెర్వు శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాస్, నాయకులు రవి, భారత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో…
బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు, బీఎస్పీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు సాయి, కవిత, నీల, శారద, హారిక, సునీత తదితరులు పాల్గొన్నారు.
