మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
సింగరేణి సేవాసమితి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరం కు గాను సింగరేణి ఉద్యోగుల భార్యలకు, పిల్లలకు పరిసర ప్రాంతాల నిరుద్యోగ మహిళలకు నిర్వహించే వివిధ వృత్తి శిక్షణ కోర్స్ లయిన ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం, ప్రీ ప్రైమరీ టీచర్ కోచింగ్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్స్ లో 3 నెలల కాల పరిమితి కొరకు శిక్షణ ఇచ్చేందుకు అనుభవం, అర్హత కలిగిన శిక్షకుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్‌సి కే.బసవయ్య శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధముగా సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి శిక్షణా కోర్సులయిన ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం, ప్రీ ప్రైమరీ టీచర్ కోచింగ్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్స్ లను నేర్చుకోవటానికి ఆసక్తి కలిగిన మహిళల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు
“ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ హైదరాబాద్” వారిచే సర్టిఫికెట్లు కూడా అందచేయబడునని తెలిపారు. అయితే ధరఖాస్తులను పరిగణలోకి తీసుకోవటంమాత్రం బ్యాచ్ కి ఉన్న పరిమితులకులోబడి ఉంటుందని ఒకవేళ బ్యాచ్ నిర్దేశిత సంఖ్య కన్నా ఎక్కువ ధరఖాస్తులు వచ్చినట్లయితే బ్యాచ్ పరిమితి ప్రకారం ఎంతమందికి శిక్షణ ఇవ్వగలమో, అంతమందికి మాత్రమే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు తో పాటు సంబంధిత సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి సింగరేణి హెడ్ ఆఫీస్ నందు గల కమ్యూనికేషన్ విభాగంలో ఈ నెల 26వ తేదీ లోపు అందజేయాలని సింగరేణి జిఎం వెల్ఫేర్ బసవయ్య పేర్కొన్నారు.