మన్యం న్యూస్,ఇల్లందు:
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భద్రాద్రి జిల్లా భాజపా టీచర్స్ సెల్ కన్వీనర్ వాంకుడోత్ హథిరామ్ నాయక్ ఖమ్మంలోని అతిధిగృహంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా రైతు సమస్యలు,ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలు,కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన హతీరామ్ నాయక్ మంత్రికి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ టేకులపల్లి మండల అధ్యక్షులు దారావత్ బాలాజీ నాయక్, ఉపాధ్యక్షలు సురేష్ నాయక్, నాయకులు బానోత్ గణేష్ నాయక్,రాజు నాయక్, బాలకృష్ణ,రమేష్,బాల తదితరులు పాల్గొన్నారు.