- ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం
- సమయపాలన పాటించని సర్పంచులు అధికారులు
- అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ రేగా కాళిక
మన్యం న్యూస్ కరకగుడెం: ఆగష్టు 18
ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన కరకగూడెం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ,మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, జరిగినటువంటి పనుల గురించి ప్రజా ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా అనేక నిధులను గ్రామ పంచాయతీ లకు ఇస్తుందని,వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే,ఇంకా అధిక మొత్తంలో గ్రామ పంచాయతీ లకు నిధులు వస్తాయని,అదే విధంగా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు కృషితో మండలానికి అధిక మొత్తంలో నిధులు ఇస్తున్నారని,ప్రతి గ్రామపంచాయతీలో సీసీ రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు నిర్మించుకున్నామని,అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను నిష్పక్షపాతంగా సర్వే ద్వారా ఎంపిక చేయాలని సూచించారు.ఏ గ్రామంలో నైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకోని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీపీ కాళిక తెలియజేశారు. సర్పంచులు,అధికారులు కచ్చితంగా సమయపాలన పాటించాలని,అలా పాటించని వారిపై చర్యలు తీసుకోక తప్పదని,అదేవిధంగా అధిక వర్షాలు పడడం వల్ల వాగులు వరదలు రావడం జరుగుతుందని,ఎప్పుడూ అధికారులు గ్రామాలలో అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.