మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిద్దామని గౌడ సంఘం మండల అధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చాడు. శుక్రవారం ప్రధాన సెంటర్లో గౌడ సంఘం ఆద్వర్యలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌడ సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సాదియా సుల్తానాకు అంజేశారు. ఈసందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…. మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీహాలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో కుల వృత్తిని కాపాడేందుకు రెండు ఎకరాల స్థలం ఏర్పాటు చేసి, వాటిలో తాటి చెట్లు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడసంఘం బాధ్యులు బొర్రా కేశవరావుగౌడ్, పల్లెవీరప్రసాద్ గౌడ్, కల్గిం వెంకటేశ్వర్లుగౌడ్, అంతటి కిషన్ గౌడ్, అంతటి హరీష్ గౌడ్, నిమ్మల పెద్దవెంకన్నగౌడ్, అంతటి శివక్రిష్ణగౌడ్, కుక్క తిరుపతిరావుగౌడ్, వేములకొండ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.