- బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్
- జయంతి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎస్సై నాగూల్ మీరాఖాన్
మన్యం న్యూస్ , పినపాక:
బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఏడూళ్ల బయ్యారం ఎస్సై నాగుల్ మీరాఖాన్ అన్నారు. మండల పరిధిలోని గోపాలరావు పేట గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3 వందల సంవత్సరాల క్రితం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వంత సైన్యం ఏర్పాటు చేసు కొని బహుజన కులాలను ఏకం చేసి రాజ్యాధికార కాంక్షను రగిలించిన పోరాట యోధుడు అని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం గోపాలరావు పేట గౌడ సంఘం ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి నర్సింహారావు, నిమ్మల వెంకన్న గౌడ్ ,తోట వెంకటేశ్వర్లు, రావుల సోమయ్య గౌడ్, సమ్మయ్య గౌడ్, కొలగాని పాపరావు గౌడ్, గోపాలరావు పేట గౌడ సంఘం నాయకులు కొంపెల్లి మల్లేష్ గౌడ్ , డి.సాంబశివరావు గౌడ్ , కొత్త దామోదర్ గౌడ్, కొంపెల్లి నాగేశ్వరరావు గౌడ్, కొంపెల్లి రమేష్ గౌడ్, సునీల్ గౌడ్, చిర్ర వెంకన్న గౌడ్, చిర్ర రాములు, సంతోష్ గౌడ్, చిర్ర కుమార్, రవి, జలగం అశోక్ గౌడ్, కోటి గౌడ్, జానపద కళాకారుడు సిద్దెల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.