మన్యం న్యూస్, కరకగూడెం :
బహుజన రాజ్యం కోసం ఆధిపత్యంపై తిరుగుబాటు చేసిన తెలంగాణ శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలను గౌడ్ కులస్తుల మండల కమిటీ అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనియాడారు.సర్వాయి పాపన్న ఆనాటి అరాచక పాలనను ఎదురించి నిలిచిన ధీరుడని వివరించారు.భూస్వామ్యులు, పెత్తందారులను ఎదురించి, బడుగు బలహీనర్గాలకు అండగా నిలిచారని కీర్తించారు.ఈ కార్యక్రమంలో రావుల సోమయ్య, పెద్ద రామలింగం ,ప్రణయ్, ముంజల, సాయి బాబా, భిక్షపతి,రావుల వేణు,గడిపల్లి రాములు, రవి , యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.