మన్యం న్యూస్, అశ్వరావుపేట ఆగష్టు,18: మండలం లోని తిరుమల కుంట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు శుక్రవారం తిరుమల కుంట గ్రామంలో బొడ్రాయి సెంటర్లో గౌడ్ సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపట్నానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరుడు, తెలంగాణలో తొలి బహుజన రాజ్య స్థాపకుడు మొగల్ పాలకుల గుండెల్లో సింహా స్వప్నం దొరల ఆధిపత్యాన్ని ఎదిరించిన వీరుడు, గ్రామదేవతల ప్రాధాన్యాన్ని పెంచిన విధాత లండన్ విక్టోరియా& అల్బర్ట్ మ్యూజియంలో శాశ్వత శిలాశాసనంగా నిలిచిన తెలంగాణ చక్రవర్తి ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం చేసి పుస్తకంగా ముద్రించిన పాపన్న చరిత్ర తెలంగాణ ప్రాంతాన్ని 30 ఏళ్ళు పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న రాజరికం ఎవరి అబ్జసొత్తు కాదని నిరూపించిన బహుజన వీరుడు బహుజనులకు రాజ్యాధికార వారసత్వాన్నిచ్చిన గౌడ్ ముద్దు బిడ్డ బహుజనుల ఆరాధ్య దైవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం అధ్యక్షులు పరికిల రాంబాబు గౌడ్, గోదా మల్లయ్య గౌడ్, కళ్ళుగీత కార్మిక సంఘం అధ్యక్షులు బొర్రా వెంకటేశ్వరావు గౌడ్, జుజ్జూరి వెంకటనారాయణ గౌడ్, జుజ్జురి వెంకన్న బాబు గౌడ్, పరికిల రామకృష్ణ, జుజ్జురి పోతురాజు, గొల్లపల్లి పొలరావు, పానుగంటి సత్యం, పానుగంటి శ్రీను, పల్లెల రామ లక్ష్మయ్య, గడ్డం పుల్లారావు, కొనకళ్ళ మోహన్ రావు, కోన సతియ్య, కోన రోశయ్య, బొడ్డు సత్తిబాబు, దాసరి సుబ్బారావు, నాగుల చెన్నారావు, పర్స రమేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.