మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 18: మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానం కార్యక్రమంలో భాగంగా 2023-2024 సంవత్సరములు గాను నూతన అడ్మిషన్ లని ప్రారంభించటం జరిగింది .ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి కరపత్రాలను ఆవిష్కరించారు.అనంతరం ఎంపీపీ జల్లిపల్లి మాట్లాడుతూ 14 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే అని, బడి మధ్యలో మానివేసిన వారికి మరియు పదవ తరగతి ఫెయిల్ అయి 14 సంవత్సరాలు నిండిన వారికి పదవ తరగతి చదువుకునే సువర్ణావకాశం అని, 15 సంవత్సరాలు నిండి 10వ తరగతి పూర్తి చేసిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్సు చదువు కొనే అవకాశం ఉందని అన్నారు. ఇంటర్మీడియట్ మానేసిన వారికి, ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం, మహిళలకు పలు వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగులకు ప్రజాని ప్రజా ప్రతినిధులకు వివిధ సంఘ సభ్యులకు మరియు సామాజికంగా ఆర్థికంగా వెలుపబడిన వర్గాల వారికి ఒక సదవకాశం అన్నారు. సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహించ బడతాయని, అలాగే దీనిలో కొన్ని వెసులు బాటు ఉంటుందని, అవి వృత్తి విద్యా ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే అవకాశం, నేత పాఠశాలలో పదవ తరగతిలో కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులు ఫెయిల్ అయినప్పటికీ మీరు పాసైనా రెండు సబ్జెక్టుల మార్కులు బదలాయించుకునే అవకాశం ఉంటుందని, ఉచిత సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్, ఇష్టమైన ఏవైనా ఐదు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేయవచ్చు అని, మహిళలకు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు, దివ్యాంగులకు, మరియు మాజీ సైనికుల పిల్లలకు ఫీజు రాయితీ
అవకాశం ఉంటుందని అయన తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, అశ్వరావుపేట జడ్పీహెచ్ఎస్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ టి వెంకట్ పాల్గొన్నారు.