UPDATES  

 సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం మున్సిపాలిటీ 16వ వార్డు నుండి బీ. ఆర్.ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

  • సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం మున్సిపాలిటీ 16వ వార్డు నుండి బీ. ఆర్.ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
  • అభివృద్ధి, ప్రజాసంక్షేమమే కేసీఆర్ తారకమంత్రం

ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మన్యం న్యూస్,ఇల్లందు: ఇల్లందు పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికల కార్యక్రమం జరిగింది. మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజిత ఆధ్వర్యంలో యాభైకుటుంబాలు, వందమంది యువతకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గులాబీజెండా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ…అభివృద్ధి ప్రజాసంక్షేమమే తారక మంత్రంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలన నచ్చి పార్టీలోకి చేరి సీఎం కేసీఆర్ అడుగు జాడల్లోనే తమ ప్రయాణం అంటూ ముందుకు కదిలిన యువతను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతిఒక్కటి కూడా ప్రతిగడపకు చేరుతున్నాయని అందులో భాగంగా ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా బిఆర్ఎస్ బాటలోనే ప్రయాణించాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆకాంక్షించారు. బీ.ఆర్ఎస్ పార్టీ కుటుంబంలోని ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తి అని, ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని అందుకొరకు ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ కు బాసటగా ఉండి ఆయన బాటలోనే ప్రయాణం కొనసాగించాలని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, 24 వార్డ్ కౌన్సిలర్ వాంగుడోత్ తార, పట్టణ నాయకులు గిన్నారపు రవి, పట్టణ ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, మండల ఇంచార్జ్ యలమద్ది రవి, పార్టీ పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, మండల ఉపాధ్యక్షుడు డేరంగుల పోశం, ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్ మరియు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !