UPDATES  

 మాలలపై విషం కక్కడం మానుకో *మాదిగల ఆత్మగౌరవాన్ని మనవాదులతో తాకట్టు పెట్టొద్దు:పిల్లి రవివర్మ

మాలలపై విషం కక్కడం మానుకో
*మాదిగల ఆత్మగౌరవాన్ని మనవాదులతో తాకట్టు పెట్టొద్దు:పిల్లి రవివర్మ
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:జాతీయ మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ మాలమహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు,బూర్గంపహడ్ మండల అధ్యక్షుడు పిల్లి రవివర్మ పాల్గొని మాట్లాడారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మందకృష్ణ పై చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాలలపై విషం కక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.సామాజిక న్యాయం గురించి మాట్లాడే మందకృష్ణ మాదిగ అగ్రవర్ణాలకు చెందిన రెడ్లు,వెలమలు,కమ్మలుమిగతా అగ్రవర్ణ నాయకులకు అన్ని రాజకీయ పార్టీలో అధ్యక్షులుగా,మంత్రులుగా,ఎమ్మెల్యేలుగా జడ్పిటిసిలుగా,వార్డ్ మెంబర్ వరకు వాళ్ల జనాభా ఎంత? వారు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఎంత? అవి నీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. దేశం మొత్తం అగ్రవర్ణ చేతిలో బందీ ఐన నీవ్వు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకున్న నీవు ఎమ్మార్పీఎస్ నాయకుడుగా కాకుండా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారు.ఎస్సీ వర్గీకరణ కోసం మనువాదుల కాళ్లు మొక్కుతూ మాదిగల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దన్నారు.ప్రభుత్వం ఎస్సీలకు అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో 85 శాతం మాదిగలే అనుభవిస్తున్న సంగతి ఎందుకు మాట్లాడతలేరని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడిచి రాజ్యాధికారం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాయపూడి రామ్ కుమార్,కాకర్ల పండు,అంతోటి సిసింద్రీ,మంద సన్నీ,దార సంజయ్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !