బిఆర్ఎస్ పార్టీలోకి 40కుటుంబాలు చేరిక
*గులాబీకండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించినా ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు, నియోజక వర్గంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేస్తున అభివృద్ధికి ఆకర్షితులై దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన సుమారు 40కుటుంబాలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో మెచ్చా స్వగృహం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే మెచ్చా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అలాగే స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు నిర్మాణం చేశారనీ, ఇటీవలే అశ్వారావుపేటలో 100పడకల ఆసుపత్రిని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అందులో భాగంగా నేడు 40మంది ఎమ్మెల్యే మెచ్చా సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరామని రానున్న రోజుల్లో గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యే మెచ్చా గెలుపు కోసం కష్టపడతాం అని అన్నారు. మళ్ళీ గెలిచేది వచ్చేది ఎమ్మెల్యే మెచ్చా నే అని ధీమా వ్యక్తం చేశారు. చేరిన వారిలో కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్ వలమాలిన నాగలక్ష్మి, పల్లె శ్రీను, పల్లె నాగు, వలమాల వెంకటేశ్వరరావు, అంబలై, దొలయ్య, మల్లిక, స్వర్ణ, చందన, తుతా సురేంద్ర రామకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు.
