ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు
* నోడల్ అధికారిణి బి.సులోచన రాణి
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను,భద్రాది కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారి బి.సులోచన రాణి ఆకస్మకికముగా కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం 2023-24 విద్యా సంవత్సరం కు సంబంధించిన రిపోర్టును కళాశాల ప్రిన్సిపాల్ జి.చీన్యా ను అడిగి తెలుసుకున్నారు.ఈ విద్యా సంవత్సరం సంబంధించిన,విద్యార్థులు అటెండెన్స్,ఉపాధ్యాయుల అటెండెన్స్,టీచింగ్ డైరీ,కేర్ టేకర్ షీట్స్,ప్రోగ్రెస్ కార్డ్స్,యాన్యువల్ ప్లాన్,సిలబస్ ఎంతవరకు పూర్తయినది,పలు అంశాలను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో సంభాషించి ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకున్నారు.తెలుసుకొని అధ్యాకుల బోధనపై సంతృప్తి వ్యక్తం వ్యక్తపరిచారు.మొదటి యూనిట్ టెస్ట్ లో వచ్చిన మార్కులను విద్యార్థులను అడిగి తెలుసుకుని ప్రణాళిక బద్ధంగా చదివితే మంచిర్యాంకులు సాధించవచ్చు అని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. కళాశాలలో అడ్మిషన్స్ పెంచాలని,స్టడీ హౌర్స్ కండక్ట్ చేయాలని,యూనిట్ టెస్ట్ క్రమం తప్పకుండా నిర్వహించాలని,ఎంసెట్ నీట్ తరగతులను బోధించాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి,చీన్యా,ఏఏం జీవో సిహెచ్,నాగేశ్వరరావు,సీనియర్ అధ్యాపకులు,ఎన్ఎస్ కుమార్ మరియు కళాశాల సిబ్బంది,విద్యార్థులు,నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.