UPDATES  

 అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర శాఖల ప్రధాన కార్యదర్శులతో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. కోటి వృక్షార్చనలో మన జిల్లాకు కేటాయించిన 4 లక్షల 85 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. మొక్కలు నాటేందుకు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతిలల్లో గుర్తించిన స్థలాల్లో గుంతల తవ్వకం చేపట్టాలని అన్నారు. తెలంగాణకు హరితహారం లక్ష్యాలను ఆగస్టు 26 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతివారం గొర్రెల యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, గొర్రెల కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ, గొర్రెలకు బీమా సౌకర్యం తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని కలెక్టర్ పేర్కొన్నారు. బీసి కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం వివరాలు ఆన్ లైన్ లో నమోదులు చేయాలని చెప్పారు. మైనారిటీలకు ఆర్థిక సహాయం సంబంధించి మన జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం శనివారం చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమ అధికారికి సూచించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి.కిష్టా గౌడ్, జడ్పి సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, బిసి సంక్షేమ అధికారి ఇందిర, ఎస్సి అభివృద్ధి అధికారి అనసూర్య, మున్సిపల్ కమిషనర్లు
తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !