UPDATES  

 సీఎం కేసీఆర్ సంక్షేమం,పేట అభివృద్ధి ని చూసి మళ్ళీ ఆశీర్వదించండి

సీఎం కేసీఆర్ సంక్షేమం,పేట అభివృద్ధి ని చూసి మళ్ళీ ఆశీర్వదించండి
*సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి లో దూసుకుపోతున్న పేట నియోజకవర్గం

*రూ.5కోట్ల సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన

*ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 19: సీఎం కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు అన్నారు .దమ్మపేట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మందలపల్లి నుంచి దమ్మపేట జయలక్ష్మి టాకీస్ వరుకు జరుగనున్న నిర్మాణ పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ది చేస్తూ మండల కేంద్రాలను కూడా అభివృద్ది చేయాలని దృడ సంకల్పంతో దమ్మపేటకి 5కోట్లతో సెంట్రల్ లైటింగ్ కు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే అనేక అభివృద్ది పనులు చేస్తున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేస్తున్నారని, మట్టి రోడ్డు అనేది లేకుండా చేయడమే ఆయన లక్ష్యం అని, ఇప్పటికే అన్ని సీసీ రోడ్లు అయ్యాయని, రానున్న 2నెలల్లో అన్ని సీసీ రోడ్లు , బీటీ రోడ్లకు నిధులు రానున్నాయన్నారు. చేసిన అభివృద్ది చూసి రేపు ఆశీర్వదించాలని అన్నారు. విపట్వారీగూడెం గ్రామంలో ప్రపంచ ఫోటో గ్రాఫర్ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని జెండా ఆవిష్కరించారు అనంతరం మండల ఫోటో గ్రాఫర్ లు ఎమ్మెల్యే మెచ్చని శాలువాతో సత్కరించారు. మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిచి వచ్చే ఏడాది ఫోటో గ్రాఫర్ దినోత్సవ వేడుకలు మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించుకోవాలని ఫోటో గ్రాఫర్ లు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, పైడి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజేశ్వరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామస్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !