మన్యం న్యూస్, గుండాల: గుండాల క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. మండలం పరిధిలోని ముత్తాపురం, సాయనపల్లి, నరసాపురం గ్రామాల్లో ఉన్న వరద బాధితులకు బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గోవింద నరసింహారావు, సనప రాజు, రామకృష్ణ, మస్తాన్ , తదితరులు పాల్గొన్నారు.
