మన్యం న్యూస్,ఇల్లందు:బాడీలారీలకు లోడింగ్ ఇవ్వాలని ఇల్లందు బాడీలారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీ ఎం జాన్ ఆనంద్ కు శనివారం వినతిపత్రం అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, పాయం వెంకన్నలు మాట్లాడుతూ.. గత మూడునెలలుగా ఇల్లందులో బొగ్గు లేకపోవడం వలన బాడీలారీల ఓనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిమూలాన లారీ యజమానులతో పాటు లారీమీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా మారిందన్నారు. జెకె ఫైవ్ ఓసి నుండి నేడు బొగ్గుఉత్పత్తి అవుతుందని, షిప్టుకు ఐదు లారీలకు లోడింగ్ ఇచ్చేవిధంగా కోల్ యాక్షన్లో పెట్టి లారీఓనర్ల కుటుంబాల్ని ఆదుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జీ ఎం స్పందిస్తూ ఫస్ట్ తారీకు యాక్షన్ పూర్తిచేసి లోడింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామని దానికంటే ముందు ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ లారీ యజమానులతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సానుకూలంగా స్పందించిన జిఎంకు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ యాకుబ్ షావలి, దద్దుబాయి సుభాని, నూరుద్దీన్, పవన్, గౌస్, వెంకటేశ్వర్లు, సదా, వేముల శ్రీను, సుధాకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.