మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- స్వచ్ఛ సర్వేక్షన్ సెంట్రల్ టీమ్ అధికారి ఎస్ పరుశురామ్ శుక్రవారం ఇల్లందు మండలం లోని రొంపేడు గ్రామ పంచాయితీలో పర్యటించి స్వచ్ఛతా పనులను పరిశీలించారు. గ్రామపంచాయితీ లోని మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు వినియోగం, తడిపొడి చెత్త నిర్వహణ ను తనిఖీ చేశారు. అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలరాజు, ఎంపీఓ చిరంజీవి, పంచాయితీ సెక్రటరీ అన్వేష్ పాల్గోన్నారు.