మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం లోని పినపాక కరకగూడెం మండలాలలో పర్యటించనున్నారని పినపాక కరకగూడెం మండలాల బీ. ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రావుల సోమయ్య గౌడ్ లు శనివారం వేరువేరు ప్రకటనలో తెలిపారు.
పినపాక మండల పర్యటన వివరాలు
పాత రెడ్డిపాలెం నుండి చింతలబయ్యారం బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఉదయం 8.30 శంకుస్థాపన,
కొత్త గుంపు నుండి భూపతిరావుపేట బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఉదయం 9:30 గంటలకు శంకుస్థాపన,
జానంపేట నుండి అమరారం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఉదయం 10 గంటలకు శంకుస్థాపన,
మల్లారం నుండి వెంకటేశ్వరపురం వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు ఉదయం 10:30 కు శంకుస్థాపన,
గొట్టెల్ల నుండి చిన్నరాజుపేట బీటి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కరకగూడెం మండలంలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
కరకగూడెం మండలం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
గొడుగు బండ గ్రామంలో సుమారు 18 కోట్ల ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న వట్టి వాగు నిర్మాణ పనులకు శంకుస్థాపన మధ్యాహ్నం 12 గంటలకు,ఆర్ అండ్ బి రోడ్డు నుండి గాంధీ నగర్ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ,పాపాయిగూడెం నుండి బురదారం బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మధ్యాహ్నం 2 గంటలకు,పాపాయిగూడెం నుండి నిమ్మగూడెం బిటి రోడ్డు నిర్మాణ పనులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శంకుస్థాపన,పోలకమ్మతోగు నుండి దోమేడ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన సాయంత్రం 3: గంటలకు,కరకగూడెం నుండి మోట్లగూడెం బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన సాయంత్రం 4: గంటలకు చేయనున్నారు. ఇట్టి కార్యక్రమాలకు మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ఆయా మండలాల మండల అధ్యక్షులు కోరారు.
