UPDATES  

 ప్రతి గ్రామానికి రహదారి నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రతి గ్రామానికి రహదారి నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.
మండలంలోని ఐదు బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యేరేగా కాంతారావు
మన్యం న్యూస్ ,కరకగూడెం: మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి బిటి,సిసి రోడ్లు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. అయన ఆదివారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మండల పరిధిలోని తాటిగూడెం గ్రామం ఆర్అండ్ బి రోడ్డు నుండి గాంధీనగర్ కాలనీ వరకు కోటి రూపాయలు, పాపాయిగూడెం గ్రామం నుండి నిమ్మగూడెం గ్రామం వరకు 50 లక్షలు రూపాయలు, పాపాయిగూడెం గ్రామం నుండి బుర్దరాం గ్రామం వరకు 50 లక్షల రూపాయలు, కోలకమతోగు గ్రామం నుండి దోమేడా గ్రామం వరకు కోటి రూపాయలు, కరకగూడెం గ్రామం నుండి మోట్లగూడెం వరకు రెండు కోట్ల 25 లక్షలు వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న బిటి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ మండలంలోని ఐదు బిటీ రోడ్లకు గాను ఐదుకోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గత జులై నెలలో కురిసి భారివర్షాలకు అక్కడక్కడ రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకపోయిన వాటికి త్వరలోనే మరమ్మతులు చేపిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు దొర, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, హరికగూడెం సర్పంచ్ రామనాథం, సీనియర్ నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, నాయకులు బుడగం రాము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !