UPDATES  

 తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయిన కుసుమ జగదీష్ జయంతి వేడుకలు

మన్యం న్యూస్, మంగపేట:
మంగపేట మండలం రాజుపేట బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమకారులు దివంగత నేత ,ములుగు జిల్లా మొదటి జిల్లా పరిషత్తు చైర్మన్,బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు
కీ”శే కుసుమ జగదీష్ 47 వ జయంతి ని కేక్ కట్ చేసి నివాళులు అర్పించి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్బంగా
జడ్పీ చైర్మన్ తో గడిపిన జ్ఞాపకాలను బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నెమరవేసుకున్నారు.కుసుమ జగదీశ్ పోరాట పటిమ, మాట తప్పని, మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ సాధించిన తీరు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు .ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ తోట రమేష్, యూత్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్, మండల ఉపాధ్యక్షులు యడ్లపల్లి నరసింహ రావు, బండ్ల మధు బాబు,జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు,మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరా స్వామి,గ్రామ కమిటి అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు, రాజమల్ల సుకుమార్, ప్రదాన కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్, యస్సీ సెల్ మండల ప్రదాన కార్యదర్శి మంచాల నాగేంద్ర కుమార్, మలికంటి శంకర్ , యస్కే రాయుసాహ్బ్ కర్రీ శ్రీను,రూప భద్రయ్య,ఎస్ది హుసేన్, యాగ్గడి అర్జున్,ఇందారపు రమేష్,కౌసర్,కొమరం శివాజీ ,వంశీ ,తదితర నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !