గుండాల, వీరాపురం రహదారి మరమ్మతుపనులను ప్రారంభించిన అధికారులు
మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో గుండాల, వీరాపురం రహదారి పనులను అధికారులు ఆదివారం ప్రారంభించారు. గత నెలలో కురిసిన వర్షాల ప్రభావానికి రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. మణుగూరు, గుండాల వచ్చే ఆర్టీసీ బస్సు సైతం రోడ్డు బాగా లేకపోవడంతో నిలిచిపోయింది. తక్షణమే స్పందించినఎమ్మెల్యే రేగా రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయడంతో అధికారులు పనులను ప్రారంభించారు. సాధ్యమైనంత మేర త్వరగా మరమ్మతు పనులు పూర్తిచేసి పూర్తిస్థాయి రాకపోకలకు రహదారిని సిద్ధం చేస్తామని అధికారులు మన్యం న్యూస్ కి తెలిపారు.
