మన్యం న్యూస్,ఇల్లందు:మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 79వ జన్మదినం సందర్భంగా ఆదివారం పట్టణంలోని జగదాంబ సెంటర్ వద్దగల రాజీవ్ గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, జెడ్పీ చైర్మన్ కోరం ప్రసంగిస్తూ.. ఐటిరంగాన్ని పరుగులు పెట్టించి దేశాన్ని అభివృద్ధిపదంలో నడిపిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, యువతే దేశానికి ఆదర్శమని యువతతోనే దేశం అభివృద్ధి చెందుతుందని 21సంవత్సరాల ఓటుహక్కును 18 సంవత్సరాలకి తగ్గించిన దార్శనికుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారివెంట మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న, సర్పంచులు పాయం స్వాతి, పాయం లలిత, ఎంపీటీసీ పూనెం సురేందర్, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళసూర్యం, ముక్తి కృష్ణ, సువర్ణపాక సత్యనారాయణ, మధారమ్మ, ఊరుగోండ ధనుంజయ్, ఆముదాల ప్రసాద్, ఈసూబ్, రావూరి సతీష్, కుంటా రాజు, అజ్జు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.