భద్రాద్రి జిల్లా గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.భద్రాద్రి జిల్లా గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని వారు స్పష్టం చేశారు.జిల్లా లోని ఐయిదు నియోజకవర్గాలను గెలిచి సీఎం కెసిఆర్ కు గిఫ్ట్ ఇస్తామని తెలిపారు.సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.విద్య,వైద్యం,విద్యుత్, వ్యవసాయం,ఉపాధి రంగాలలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు.కోట్ల రూపాయలతో ప్రతి మారుమూల గ్రామానికి సిసి రోడ్లు,బీటి రోడ్లు,తీసుకువచ్చాము అన్నారు.గతం ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను వంద శాతం ప్రజలకు అందేలా కృషి చేశామని తెలిపారు.రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని విప్ రేగా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు వారు సూచించారు.ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి వివరించాలని వారు తెలియజేశారు.భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు,జడ్పీటీసీలు పోశం నర్సింహారావు,కామిరెడ్డి శ్రీ లతా,ఎంపీపీ లు,పీఏసీఎస్ చైర్మన్ లు కుర్రి నాగేశ్వరరావు,బిక్కసాని శ్రీనివాసరావు,సర్పంచులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.