UPDATES  

 రేగా హామీ.. కేసీఆర్ ధీమా!

రేగా హామీ.. కేసీఆర్ ధీమా!
* సిట్టింగులతో సహా.. తెల్లం వెంకట్రావుకు బెర్తులు ఖరారు
* జోష్ మీదున్న ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు
* ఐదుకు ఐదు సీట్లు గెలిపించుకునేందుకు “రేగా” వ్యూహం
* జిల్లావ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నితుడిగా.. బిఆర్ఎస్ పార్టీకి వీరాభిమానిగా.. ప్రజల అభిమన్యుడిగా ముద్ర వేసుకున్న ఆదివాసి ముద్దుబిడ్డ మన్యం టైగర్ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుకు ఐదు సీట్లు గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తానని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వివిధ సమావేశాల్లో బహిరంగ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసింది. రేగా తన ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన బలగం బహిరంగంగా పేర్కొంటుంది.
సీఎం కేసిఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ఖరారు చేసి విడుదల చేసిన లిస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఇటీవల ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దగ్గరగా ఉన్న తెల్లం వెంకట్రావు గులాబీ పార్టీలో చేరిన ఆయనకు సైతం భద్రాచలం అసెంబ్లీకి బెర్తు ఖరారు చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జరుపుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల కేటాయింపు ప్రకటించడంతో అందులో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెల్లం వెంకట్రావులను అభ్యర్థులుగా ప్రకటించడంతో వారంతా జోష్ లో మునిగితేలారు. ప్రజల అభిమాన నాయకులకు బెర్తులు ఖరారు చేసిన
గులాబీ బిగ్ బాస్ కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకోవడం పట్ల జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది.
అభ్యర్థుల గెలుపు కోసం రేగా వ్యూహం..!
బిఆర్ఎస్ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తమ పార్టీ తరపున రంగంలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహంగా ముందుకు పోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఇప్పటి నుండే రేగా జనం మధ్య ఉండేందుకు స్పీడ్ పెంచాడు. పెండింగ్లో అభివృద్ధి పనులు ఉంటే వాటిని
స్పీడ్ అప్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారిచేస్తూ కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ రేగ కాంతారావు ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా రేగా జిల్లా సెంటర్లో ఉండి నియోజకవర్గాల వ్యాప్తంగా మానిటరింగ్ చేయనున్నారు. రేగా ఏదైతే శఫదం చేశాడో దానిని నెరవేర్చేందుకు, ఐదుకు ఐదు సీట్లు గెలిపించుకుని తీరుతామని చెప్పాడో అది
నిజం చేసేందుకు తామంతా ఐక్యంగా ఉండి పని చేస్తామని పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పేర్కొనడం గమనించాల్సిన విషయం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !